గేమ్ ఛేంజర్..
ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. డిసెంబర్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు. మూడేళ్ల నుంచి నిర్మాణంలో ఉంటూ విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది.
డాకు మహారాజ్..
డాకు మహారాజ్‌గా బాలయ్య కనిపించబోతోన్నాడు. బాబీ తీస్తున్న ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ మేరకు వదిలిన టైటిల్ టీజర్ అదిరిపోయింది. ఇందులో బాలయ్య డాకు మహారాజ్‌గా కనిపించబోతోన్నాడు. అయితే ఎవరీ డాకు మహారాజ్? అతని కథ ఏంటి? ఎక్కడి వాడు? ఏం చేస్తుండేవాడు? అని ఇలా అందరూ గూగుల్ చేస్తున్నాడు. డాకు మహారాజ్ టైటిల్ టీజర్‌లోనూ ఓ డైలాగ్ పెట్టాడు. ఇతనికి రాజ్యం లేదు కానీ మహారాజు.. యుద్దాలు చేసినట్టుగా చూపిస్తున్నాడు బాబీ.
సంక్రాంతికి వస్తున్నా..
విక్టరీ వెంకటేష్ , యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి భారీ విజయాలను అందుకున్నాయి. ఈ రెండింటిని ప్రతిష్టాత్మక సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. క్రైమ్ డ్రామాగా సినిమా రాబోతోంది. ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదల కాబోతోంది.
