ఆర్టీసీ అనునిత్యం ప్రజలను వారి గమ్యస్థానానికి చేర్చుస్తూ.. వారి జీవితాల్లో భాగమైపోయింది. రోజు కొన్ని లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటారు. అయితే  ఎక్కువగా ఆర్టీసీ బస్సులను ఎవరూ వినియోగించుకుంటున్నారనే.. ప్రశ్నవొస్తే.. ఖచ్చితంగా చెపొచ్చు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు. కొంచెం ఆర్ధిక స్థోమత మెరుగ్గా ఉన్నవారు సైతం ప్రయాణిస్తుంటారు. కానీ మెజార్టీ పోవొర్టీ లైన్ లో ఉన్నవారు. పోవొర్టీ లైన్ కింద ఉన్నవారే.. అయితే మన ప్రభుత్వాలు సంక్షేమా పధకాలు కూడా  అమలు చేసేది వారికే.. మన రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చేది కూడా వీరిని దృష్టిలో పెట్టుకొనే.. అంటే సంక్షేమం రూపంలో ఇలా ఇచ్చి మరల వారి నుంచే లాగేసుకుంటున్నారన్న మాట. దానికి అద్దం పట్టే విధంగా ఉన్నాయి. ఇప్పుడు పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు. ముఖ్యంగా స్టూడెంట్ బస్ పాస్ రేట్లు 50 శాంతం  పెంచడం విద్యార్థులకు పెద్ద షాక్ అని చెప్పాలి. అయితే ప్రభుత్వం మహాలక్ష్మి పధకం కింద మహిళలకు ఫ్రీగా బస్ ప్రయాణం కల్పించింది. మహిళలు కూడా ఈ పధకాన్ని ఎక్కువగా వినియోగించుకోవడంతో స్కీం సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ నష్టాల్లో పడిపోయిందని, డీసెల్ రేట్లు పెరిగాయాని, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, వారి వేతనాలు రీత్యా అలాగే మూడేండ్లుగా బస్ చార్జీలు పెరగలేదని అందుచేత టిక్కెట్ రేట్లు పెంచమని ప్రభుత్వం చెప్తుంది. అలాంటప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడం ఎందుకు.. ఇప్పుడు విద్యార్థులపై భారం వెయ్యడం ఎందుకూ అని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. బస్సు పాస్ రేట్లు పెంచడం వల్ల  ఆర్థికంగా విద్యార్థులు ఇబ్బంది పడరా.. వారి తల్లిదండ్రులపై భారం పడదా.. కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ, కూలీ పనులు చేసుకుంటూ, ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటూ, తమ పిల్లల్ని పట్టణాలకు పంపి చదివిస్తున్నారు తల్లిదండ్రులు. విద్యార్థులు కూడా వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొని హాస్టల్లోనూ చిన్న రూముల్లోనూ ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. కాలేజీలు దూరం కావడంతో బస్సులో ప్రయాణిస్తూ కాలేజీలకు వెళ్తున్నారు. వారిపై ఇలా బస్ పాస్ రేట్లు పెంచడం అనేది వారు చదువులపై ప్రభావంపడే అవకాశం ఉంది. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకి 300 కోట్ల సబ్సిడీ రూపంలో ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. అలాంటప్పుడు బస్ పాస్ చార్జీలు పెంచితే వచ్చే వంద కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోలేదా..! బాలికలు, యువతులందరూ ఆధార్ చూపించి ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అదే విధంగా విద్యార్థులు కూడా ఉచితంగా ప్రయాణించటం సాధ్యపడదా..!అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, ఇతర ప్రాంతాల్లో ఉదయం, సాయంత్ర సమాయల్లో బస్సులలో విద్యార్థుల రద్ది ఎక్కువగా ఉంటుందని ఈ నేపధ్యంలో వారిని కూడా ఆర్డీనరీ బస్సులతో పాటు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణించెందుకు వీలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. దానికి బస్సు టిక్కెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది. ఆర్డీనరీ, మెట్రో, మెట్రో డిలక్స్, సిటీ ఆర్డినరీ (ఈవీ) బస్సులలో ప్రయాణించటానికి వీలు కల్సిస్తే సరిపోతుంది కదా.. కొన్ని రూట్స్ లో తిరిగే లగ్జరీ బస్సులకు పాస్ లు అనుమతి లేదు. ఉన్న పాస్ పై అధనంగా టిక్కెట్ తీసుకోవాలి. దీంతో అలాంటి బస్సులకు విద్యార్ధుల తాకిడి తక్కువగానే ఉంటుంది. అలాగే రద్ది కూడా తక్కువే.. వాటిలో అన్ని బస్సుపాసులకు ప్రయాణించే అనుమతి కల్పిస్తే మిగత బస్సులలో రద్ది తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రతి బస్సుకు విడి విడిగా పాస్ లు ఎందుకు..అన్ని బస్సులకు కలిపి ఒకటే పాస్ ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు 2023 డిసెంబర్ లో మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టిన్నప్పుడే దీనిపై రవాణా రంగ నిపుణులు ఈ స్కీం సవ్యంగా సాగలంటే ఉన్న బస్సుల కంటే అధనంగా మరో మూడు వేల బస్సులు పెంచాలని సూచించారు. సిటీలోనే 1500 బస్సులు పెంచాలని తెలిపారు. అయిన బస్సులు పెంచలేదు. దీంతో ఆర్డీనరీ ప్రయాణికులతో విపరితమైన రద్ది పెరిగింది. దీనికి తోడు సీట్లు చాలక గొడవలు, ఘర్షణలు. ఒకటి గమనిస్తే గతంలో వద్దులకు, విద్యార్ధులకు, వికలాంగులకు, జర్నలిస్టులకు, తదితరులకు రాయితీపై ఇచ్చే బస్సు పాస్ ల ఖర్చును ప్రభుత్వం సబ్సీడి రూపంలో ఆర్టీసీకి చెల్లించేది. కానీ మహాలక్ష్మి పధకం అమల్లోకి వచ్చిన తరువాత ఆ పధకాని మాత్రమే సబ్సీడి చెల్లించి మిగత పాసులను పక్కన పెట్టింది. లాభాలు ఆశించకుండా ప్రజలందరికి బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే ప్రజా రవాణా వ్యవస్థ లక్ష్యం. కాని దానికి భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దానిలో భాగంగానే బస్సుల కొరత, విద్యార్థుల బస్సు పాస్ లు పెంపు, తల్లిదండ్రులపై భారం. అయితే ఆర్టీసీలో ఉన్న కార్గో వ్యవస్థ వంటి లాభాలు తెచ్చిపెట్టె మరికొన్ని మెరుగైన ప్రత్యాన్మాయ మార్గాలపై దృష్టి సారించి, ఆర్టీసీని లాభాలలో నిలుపుకోనే చర్యల వైపు  ప్రభుత్వం అడుగులు వేయాలి. అప్పుడు సామన్య ప్రజలకు ఆర్టీసీ చేరువ అవుతుంది. విద్యార్థి తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలరు.

హను,

కంటెంట్ రైటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *