పదకొండు సీట్లే, కానీ ఓటు షేర్ 40 శాతం. 2024 ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ కోరుకుని సర్వం కోల్పోయి 11 సీట్లకే పరిమితమైంది. ఆ ఓట్ షేర్ ని సీట్లుగా మలచుకోవడంలో విఫలమైంది. దీంతో వైసిపి ఓటమిపాలైంది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠమనే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కలవకుండా చుట్టూ పరదాల మధ్య పర్యటించారు. అధికారం కోల్పోయాక ప్రజల సమస్యలపై చురుగ్గా పాల్గొంటూ తన 40 శాతం ఓట్ షేర్ ని నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు.
పొగాకు బోర్డును సందర్శించి, పోగాకు రైతులకు మద్దతు తెలిపారు. అధికారం కోల్పోయిన తర్వాత మొదటి సారి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఆయన అభిమానులతో పొదిలి జన సంద్రాన్ని తలపించింది. దీంతో ఇంకా ఆయన వెంట జనం నిలిచారనే అర్థమౌవుతుంది. ఎన్నికలు ముగిసిన ఏడాది గడిచింది. ఘోర పరాజయం చవి చూసిన పార్టీ అధినేత, చాలా కాలం తర్వాత కూడ ఇంతగా జన స్పందన రావడం అనూహ్యమే.
2019 ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఐదేళ్ల పాలన ఆనంతరం 11 సీట్లకే పరిమితం అవ్వడం ఆశ్చర్యమే. దీంతో, ప్రజలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాలు విభజనానంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరిగిందని ప్రజలు గ్రహించారు. అప్పటి పరిస్థితిని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళే వారి నాయకత్వానికే పట్టం కట్టారు. మనం చూశాము. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు మాత్రమే సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలరని 2014 ఎన్నికల్లో టిడిపికి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు తృప్తి చెందలేదు. దీంతో 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీతో అధిక్యత వచ్చింది. కానీ, అనుకున్నంత పాలన జరగలేదని గ్రహించడానికి ప్రజలు ఎంతో సమయం వేచి లేరు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయి 2024 ఓటమి పాలైంది.
ప్రజలు రాజకీయ అవగాహనలో చైతన్యవంతులు అవుతున్నారన్న విషయం స్పష్టం అవుతుంది. ఎన్నికల ముందు విచ్చలవిడిగా డబ్బు పంచెస్తేనో, బటన్ నొక్కి అకౌంట్లో డబ్బులు జమ చేస్తేనో సరిపోతుందిలే అనుకుంటే ఇంకా పప్పులో కాలేసినట్టే. వారికి ఏమి కావాలో ఎలాంటి ప్రభుత్వం వాళ్లకి అవసరమో స్పష్టమైన అవగాహనతోనే ఓటు వేస్తున్నారు. వారికి కావలసిన నాయకుడిని గద్దినెక్కిస్తున్నారు. ఈ చిన్న విషయం ఇప్పుడున్న అధికార పార్టీకి తెలియదనుకోవాలా? ఎందుకంటే కేవలం 11 సీట్లకే పరిమితమైంది. పార్టీలో కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఉన్న వారిపై కేసులు ఉండటంతో జైలు పాలు అవుతున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిందని ఇక వైసిపి పని అయిపోయిందనీ టిడిపి నాయకులూ విమర్శిస్తున్నారు. ఇంత మాత్రాన జగన్ పని అయిపోయిందని అనుకోలేము. ఎందుకంటే ఎన్నికల్లో వచ్చిన జన బలమే అందుకు నిదర్శనం. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా ప్రతిపక్షం వైసిపి ఎవరు గుర్తించిన లేకపోయినా, రాజకీయ మేధావి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుసు.
ఏపీలో వైసిపి స్థానం ఎంటో అని. జగన్మోహన్ రెడ్డికి వున్న సామాజిక వర్గాల బలం ఎక్కువగా కలిసొచ్చే అంశం. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఓట్ బ్యాంక్ కాస్తా, జగన్ వైపు మళ్లింది. ఆయన మరణానంతరం, తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయ్యింది. ఇక ఆ సాంప్రదాయ ఓటు బ్యాంకు జగన్, తన వైపు తిప్పుకోవడంలో విజయం సాధించడనే చెప్పాలి. అంతటి బలమున్నా వైసిపి కనుమరుగైపోవడం అనేది సాధ్యం కాదు.
నిన్న(బుధవారం) పొదిలిలో జరిగిన ఆయన పర్యటనలో వచ్చిన ప్రజల స్పందన నిదర్శనం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల వ్యతిరేకతను కొంచెం రుచి చూసిందనే చెప్పాలి. ఈ నాలుగు ఏండ్లు ప్రజా సమస్యలను పరిష్కరం చేయక విఫలం అయితే, సింగిల్ డిజిల్ సీట్లకు, కాకపోయినా అధికారం కోల్పోయే అవకాశం ఉంది. అసలే ఆంధ్రప్రదేశ్ లో నాయకులతో పాటు, ఓటర్లు రాజకీయాలపై ఆసక్తిగా వుంటారు. కాబట్టి, ఇప్పటికైనా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలి.
-హను,
కంటెంట్ రైటర్
